సంతాయిపేట గ్రామం మీకు స్వాగతం పలుకుతుంది
సంతాయిపేట ఒక అందమైన చిన్న గ్రామం. మా అందమైన గ్రామానికి మేమంతా గర్వపడే, మా ఊరి సిగ లో వెలసిన స్వయంభూ శ్రీ భీమేశ్వరాలయము మా వారసత్వ సంపద. దేవస్థానం వద్ద గల గల పారే సెలయేరే మా పర్యాటక ప్రాంతం. మా గ్రామ ప్రజల మంచితనం మరియూ మానవత్వమే మా అందరి స్థిరాస్తి.
సంతాయిపేట గ్రామము తాడ్వాయి మండలం కామారెడ్డి జిల్లా పరిధిలో కలదు. కామారెడ్డి నుండి 18 కిలోమీటర్ ల దూరంలో తాడ్వాయి నుండి 8 కిలోమీటర్ ల దూరంలో ఉంది. కామారెడ్డి నుండి ప్రతి రెండు గంటలకు తాడ్వాయి మీదుగ బస్సు సదుపాయం కలదు.
కామారెడ్డి పట్టణం నుండి సంతాయిపేటకు రెండు దారులు ఉన్నాయి.
కామారెడ్డి - దేవునిపల్లి - తాడ్వాయి - చిట్యాల - సంతాయిపేట
కామారెడ్డి - సరంపల్లె - చిన్న మల్లారెడ్డి - రాజంపేట - బస్వన్నపల్లి - ఆరగొండ - సంతాయిపేట
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మా గ్రామం 246 ఇళ్లతో, 1037 జనాభాతో 1041 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 523, ఆడవారి సంఖ్య 514.
మండల కేంద్రం - తాడ్వాయి
జిల్లా కేంద్రం - కామారెడ్డి
లోక్ సభ నియోజక వర్గం - జహీరాబాద్
శాసన సభ నియోజక వర్గం - ఎల్లారెడ్డి
గ్రామ పంచాయతి కార్యాలయము
ప్రాథమీకోన్నత పాఠశాల (8వ తరగతి వరకు)
అంగన్ వాడి కేంద్రము
విజయ పాల కేంద్రము
బాల వికాస నీటి శుద్దీకరణ కేంద్రము (5రూపాయలకే 20లీటర్ల త్రాగు నీరు)
ఉద్యాన వనము
రెండు మంచి నీళ్ళ ట్యాంకులు
ఈ-గ్రామపంచాయతి
ఈ-లైబ్రరీ (అధునాతన గ్రంథాలయం)
మినీ బ్యాంకు
ఫంక్షన్ హాలు
బస్టాండు
స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహములు
తెలంగాణ అమర వీరుల విగ్రహములు
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల గిడ్డంగి
స్వయంభూ శ్రీ భీమేశ్వరాలయము
హనుమాన్ మందిరము
కాళీమాత ఆలయము
పోచమ్మ గుడి
ధర్మశాల
మసీదు
కషీరు
బంజరు దొడ్డి
అందమయిన చెరువు
చిన్న కుంట
సంతాయిపేటకు దారి ఇక్కడ మ్యాప్ లో ఉంచబడినది.
!! శ్రీ భీమేశ్వర శతకము !! www.santhaipet.com My Village Santhaipet Village , Tadwai Mandal, Kamareddy District, Telangana State #Santhaipet #సంతాయిపేట #భీమేశ్వర #bheemeshwara #bheemeshwaratemple #bheemeshwarawaterfalls #waterfall #waterfalls #Santhaipet #Tadwai #తాడ్వాయి #Kamareddy #కామారెడ్డి #Nizamabad #నిజామాబాద్ #Telangana #తెలంగాణ #MyVillage